![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం వీకెండ్ ఎపిసోడ్ సూపర్ క్రేజీగా సాగింది. నాగార్జున వీకెండ్ లో అందరి బండారం హౌస్ మేట్స్ ముందు కాకుండా కన్ఫెషన్ రూమ్ కి పిలిచి మాట్లాడుతున్నాడు. డీమాన్ పవన్, రీతూని కన్ఫెషన్ రూమ్ కి నాగార్జున పిలుస్తాడు. వాళ్ళిద్దరికీ ఒక వీడియో చూపిస్తాడు. రమ్య దగ్గరికి డీమాన్ పవన్ వెళ్లి మాట్లాడతాడు. రీతూతో ఎందుకుంటున్నావ్.. నీ గేమ్ స్పాయిల్ అవుతుందన్నట్లు డిస్కషన్ చేస్తుంది. నా గేమ్ ఫస్ట్ తర్వాతే ఎవరైనా అని డీమాన్ పవన్ అంటాడు.
అసలు మీకు ఇద్దరికి మీపై క్లారిటీ ఉందా అని నాగార్జున అడుగతాడు. ఉంది సర్ హౌస్ లో నేను వీడితో ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటాడు. నా గేమ్ నేను ఆడుకుంటానని రీతూ క్లారిటీగా చెప్తుంది. నాకు అంతే సర్ తనతో ఉంటే చాలా కంఫర్ట్ గా ఉంటానని డీమాన్ పవన్ అంటాడు. ఆ తర్వాత మరొక వీడియో అని ఇంకొక వీడియో ప్లే చేస్తాడు నాగార్జున. మళ్ళీ డీమాన్, రమ్య మాట్లాడుకుంటారు. నువ్వు తనని లవ్ చేస్తున్నావ్ కదా.. ఇందాక ఏడ్చావ్ నీ కళ్ళు చూస్తే తెలిసిపోతుందని రమ్య అనగానే.. అదేం లేదు.. నేను క్లారిటీగా ఉన్న అన్నాడు. అవతల వైపు జెన్యూన్ గా ఉందో మీకే తెలియాలని రమ్య అంటుంది. లవ్ అలాంటిది ఏం లేదు ఫ్రెండ్ అంతే ఇన్ఫాక్చువేషన్ అని డీమాన్ అంటాడు. అది చూసి నీ మీద నీకే క్లారిటీ లేదని నాగార్జున అంటాడు. నాకైతే క్లారిటీ ఉందని రీతూ అంటుంది. నాకైతే కంఫర్ట్ జోన్ తను.. తనపై ఫీలింగ్ ఉందని డీమాన్ చెప్తాడు. డీమాన్ చెప్పిన దానికి ఆడియన్స్ వంద శాతం నో అని పోలింగ్ చేస్తారు.
డీమాన్ బయటకు వెళ్ళాక రీతూ ఉంటుంది. సర్ అందరు కూడా ఇదే టాపిక్ గురించి మాట్లాడతున్నారని రీతూ చెప్తుంది. వాళ్ళు నీ బలహీనత గురించి చెప్పి.. నిన్ను డౌన్ చెయ్యాలని చూస్తారు కదా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా అని నాగార్జున అంటాడు. రీతూకి క్లారిటీ ఉందో లేదో పోలింగ్ చేస్తే 50 పర్సెంట్ మాత్రమే థమ్స్ అప్ చేస్తారు. ఇప్పటికైనా ఇద్దరు క్లారిటీకి వచ్చి గేమ్ పై ఫోకస్ చేస్తారేమో చూడాలి మరి.
![]() |
![]() |